Sabitha Indra Reddy: రేవంత్‌రెడ్డి ఇల్లే చెరువులో ఉంది.. మొదట సీఎం ఇంటిని కూలగొట్టాలి
Sabitha Indra Reddy: హైడ్రా బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.
Sabitha Indra Reddy: రేవంత్‌రెడ్డి ఇల్లే చెరువులో ఉంది.. మొదట సీఎం ఇంటిని కూలగొట్టాలి
Sabitha Indra Reddy: హైడ్రా బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చామంటున్నారు బాధిత కుటుంబాలు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామంటున్నారు. ఎప్పుడు కూలుస్తారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామంటున్నారు హైడ్రా బాధితులు. నిరంకుశ ప్రభుత్వ విధానాలతో రోడ్డున పడుతున్నామని బీఆర్ఎస్ పెద్దలను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటామంటున్నారు బాధిత కుటుంబాలు.
కూల్చివేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లే చెరువులో ఉందని ఆరోపించారు. మొదట సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని కూలగొట్టాలన్నారు సబితా. పేదల ఇల్లు కూల్చి ఆనందం పొందుతున్నారన్న ఆమె.. పేదలకు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందన్నారు. హైడ్రా బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతామన్నారు సబితా ఇంద్రారెడ్డి.