Hyderabad: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Hyderabad: హైదర్‌ షా కోట్‌ దగ్గర చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

Update: 2022-12-31 06:36 GMT

Hyderabad: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

Hyderabad: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హైదర్‌ షా కోట్‌ దగ్గర చెట్ల పొదల్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. చిన్న మంగళారం నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News