Afzalgunj: హైదరాబాద్ లో రూ.10కే బిర్యానీ
Afzalgunj: ఈ కాలంలో భోజనం చేయాలన్నా, టిఫిన్ తినాలన్నా 50 నుండి 100 రూపాయిలు లేనిదే రావడం లేదు.
Afzalgunj: హైదరాబాద్ లో రూ.10కే బిర్యానీ
Afzalgunj: ఈ కాలంలో భోజనం చేయాలన్నా, టిఫిన్ తినాలన్నా 50 నుండి 100 రూపాయిలు లేనిదే రావడం లేదు. అంత ఎందుకు కప్పు టీ తాగాలంటే 10 రూపాయిలు జేబులో ఉండాల్సిందే. అయితే హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద బిర్యానీ కేవలం 10కే అమ్ముతున్నారన్న విషయం మీకు తెలుసా..? అదేంటి 10 రూపాయలకు బిర్యానీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..?
హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ఏరియాలో 9 సంవత్సరాల నుంచి ఇఫ్తికార్ మొమిన్ ఈ హోటల్ ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కేవలం పది రూపాయలకు ఒక బిర్యానీ విక్రయిస్తున్నారు. 10 రూపాయలకే బిర్యానీ లభించడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా రోజుకూలీ చేసుకునేవారు, పనివాళ్ళతో పాటు విద్యార్ధులు సైతం మనస్ఫూర్తిగా తమ కడుపు నింపుకుంటున్నారు. వాళ్లే కాదు అటుగా వెళ్లే వారంతా ఇక్కడికి వచ్చీమరీ బిర్యానీ లాగించేస్తుంటారు.
ఉదయం మొదలుకుని అర్ధరాత్రి వరకు ఇక్కడ బిర్యానీ అమ్ముతారు. తక్కువ ధరకే బిర్యానీ దొరుకుతుంది కదా అని టేస్ట్ గా ఉండదనుకుంటే పొరపాటే. ఇందులో బఠాణీలు, క్యారెట్లు, బంగాళాదుంపలు లాంటి వెజిటెబుల్స్ వేసి వండడంతో పాటు రెండు రకాల కర్రీస్ తో రుచిగా వడ్డిస్తారు. ఇక్కడ బిర్యానీ తినేందుకు డెయిలీ వచ్చేవారు కూడా ఉన్నారు.
అప్పట్లో ఇదే వెజ్ బిర్యానీని 5 రూపాయలకే విక్రయించేవారు. కానీ ధరలు పెరుగుతున్న కొద్ది బిర్యానీ రేటు కూడా పెరుగుతూ 10 రూపాయలైంది. ఐనా లాభాపేక్షతో బిర్యానీ విక్రయించడం లేదని, నలుగురు పేదలకు కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని హోటల్ నిర్వహకుడు చెప్తున్నాడు.
ఇప్పుడీ బిర్యానీ నగరం నలు మూలలు విస్తరించి ఎంతోమంది పేదల కడుపులు నింపుతోంది. ఇంతపెద్ద మహానగరంలో పది రూపాయలకే బిర్యాని లభించడంతో పేదలకు ఇదో గొప్ప వరంగా చెప్పవచ్చు. అన్నట్లు ఇక్కడ తినడమే కాకుండా పార్శిల్ సౌకర్యం కూడా ఉందండోయ్.