Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

Khammam: ప్రమాదంలో 11 మందికి గాయాలు

Update: 2023-04-25 03:05 GMT

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏన్కూరు మండల కేంద్రంలో మిర్చి కోత కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారు.. కల్లూరు మండలం అంబేద్కర్‌నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Tags:    

Similar News