Revanth Reddy: ఇవాళ పాతబస్తీలో మెట్రో పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
Revanth Reddy: ఫరూక్‌నగర్ బస్ డిపో దగ్గర మెట్రో పనులకు శ్రీకారం
Revanth Reddy: ఇవాళ పాతబస్తీలో మెట్రో పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
Revanth Reddy: ఇవాళ పాతబస్తీలో మెట్రో పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫరూక్‌నగర్ బస్ డిపో దగ్గర మెట్రో పనులకు శ్రీకారంచుట్టనున్నారు. ప్రధాన రూట్లలో మెట్రో నడపాలని...మెుదటి దశలో 72కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
ఓల్డ్ సిటీ మెట్రో మార్గం 5.5 కిలోమీటర్ల మేర నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. 2018లో మెట్రో పనులు ప్రారంభించాలని...హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ L అండ్ Tకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిల్లర్ల ఫౌండేషన్ పనులకు మార్కింగ్ చేశారు. అయితే...ఆస్తుల సేకరణ చాలా సంక్లిష్టంగా మారడంతో పనులు ముందుకు వెళ్లలేదు. సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ...103కు పైగా ప్రార్థన, మత సంబంధమైన స్థలాలకు ఇబ్బంది కలగకుండా మెట్రో పనులు చేపట్టేందుకు అవసరమైన రైట్ ఆఫ్ వే స్థలాన్ని సేకరించడం అధికారులకు కత్తిమీదసాముగా మారింది.
దీంతో ఓల్డ్ సిటీలో మెట్రో పనులను చేపట్టేందుకు ఎల్ అండ్ టీ విముఖంగా ఉన్నట్లు చర్చ జరిగింది. తర్వాత కరోనా రావటంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి దశలవారీగా సమీక్షలు చేసి...ప్రాజెక్టును ప్రారంభించాలని చెప్పడంతో అధికారులు పాతబస్తీ మెట్రో ప్రాజెక్టును పట్టా లెక్కిస్తున్నారు.