Revanth Reddy: ఎన్నికల వరకు విడతల వారీగా బస్సు యాత్ర చేయాలా..? అన్నది పరిశీలిస్తున్నాం
Revanth Reddy: త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న హస్తం పార్టీ
Revanth Reddy: ఎన్నికల వరకు విడతల వారీగా బస్సు యాత్ర చేయాలా..? అన్నది పరిశీలిస్తున్నాం
Revanth Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. ఇందుకోసం నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది హస్తం పార్టీ. అయితే.. బస్సు యాత్రపై రెండు రకాల సూచనలు వచ్చాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు మొదటి విడత బస్సు యాత్ర చేయాలా..? లేక దసరా తర్వాత 25వ తారీఖు నుంచి ఎన్నికల వరకు విడతల వారీగా బస్సు యాత్ర చేయాలా..? అన్నది పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. బస్సు యాత్రపై ఫైనల్ డెసిషన్ మాత్రం కాంగ్రెస్ హైకమాండ్‌దేనని స్పష్టం చేశారు రేవంత్.