Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...
Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...
Revanth Reddy: రాహుల్‌పై అనర్హత వేటు దుర్మార్గం...
Revanth Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే రాహుల్‌పై వేటు వేశారన్నారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు 30 రోజుల సమయం ఉన్నా.. అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష్య సాధింపేనని విమర్శించారు. భారత్ జోడో యాత్ర తర్వాతే రాహుల్‌పై బీజేపీ కక్ష సాధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితి ఉందన్న రేవంత్.. దీనిని కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందన్నారు.