Danam Nagender: అమిత్ షా చెప్పింది మహేశ్వర్ రెడ్డికి తెలీదా? స్పీకర్ నిర్ణయమే ఫైనల్..

Danam Nagender: స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని మాజీ మంత్రి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

Update: 2026-03-24 06:14 GMT

Danam Nagender: అమిత్ షా చెప్పింది మహేశ్వర్ రెడ్డికి తెలీదా? స్పీకర్ నిర్ణయమే ఫైనల్..

Danam Nagender: స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించొద్దని పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారని మాజీ మంత్రి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఈ విషయం బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి తెలుసో.. తెలియదో అన్నారు. ఆదర్శన్ నగరంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్ అనర్హత కేసులో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు జారీ చేసిన నోటీసులపై స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ఈ పిటిషన్ తో తేలిందన్నారు. తనకు ఇంకా నోటీసులు అందలేదని..నోటీసులు వచ్చిన తర్వాత అడ్వకేట్ తో సంప్రదించి సమాధానం ఇస్తామన్నారు. 

Tags:    

Similar News