EV Subsidy: తెలంగాణ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20% డిస్కౌంట్ !

EV Subsidy: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఈవీ వాహనాల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ విధి విధానాలు ప్రకరించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్

Update: 2026-03-24 04:37 GMT

EV Subsidy

EV Subsidy: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ ధరలతో సతమతమవుతున్న ఉద్యోగులకు సర్కార్ అండగా నిలబడనుంది. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ కొనుగోళ్లపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈవీల కొనుగోలుపై 20 శాతం డిస్కౌంట్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? ఎవరికీ అర్హత ఉంటుంది. అన్ని ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు సమాధానం దొరకనుంది. ఈరోజు మధాహ్నం 12 గంటలకు సెక్రటేరియట్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో ఈవివరాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విధి విధానాలపై ఒక క్లారిటీకి ప్రభుత్వం వచ్చింది. ఆ వివరాలను పొన్నం ప్రభాకర్ తెలియచేయనున్నారు.

అసెంబ్లీలో ప్రకటన..

తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పొన్నాల ప్రభాకర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా రవాణా వస్తలో భారీ మార్పులు రానున్నాయన్నారు. ఈవీల వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయతీలు ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు వెల్లడించారు. వారికి ఈవీ కొనుగోళ్లపై 20 శాతం రాయితీ ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. ఈవీ పాలసీలో భాగంగా కంపెనీలను ఈ రాయితీ కోసం కోరినట్లు చెప్పారు. కేవలం ఉద్యోగాలకే కాకుండా, అన్ని ప్రభుత్వ విభాగాల్లో 25 నుంచి 50 శాతం ఎలక్టిరిక్ వాహనాలనే వినియోగించేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు మంత్రి చెప్పారు. అంతేకాకుండా ప్రయివేట్ కంపెనీలు, ఎమ్మెన్సీలు కూడా ఈ విధానాన్నే కచ్చితంగా ఫాలో అయ్యేలా నిబంధనలు తీసుకురావాలని యోచిస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీల కొనుగోళ్లలో 20 శాతం డిస్కౌంట్ ఇవ్వడానికి విధి విధానాలు ఖరారు చేసింది ప్రభుత్వం. ఆ విధి విధానాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మీడియా సమావేశంలో వివరించనున్నారు.

Tags:    

Similar News