Karimnagar: మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలి

Karimnagar; భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 95వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లో USFI ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన.

Update: 2026-03-23 15:02 GMT

Karimnagar: మహనీయుల జీవిత చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలి

కరీంనగర్/బ్యూరో: భగత్ సింగ్, రాజ్ గురు ,సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో మిషన్ హాస్పిటల్ లో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనను తెలంగాణ చౌక్ నుండి భగత్ నగర్ భగత్ సింగ్ విగ్రహం వరకు నిర్వహించడం జరిగింది

అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయులను కొనియాడారు వారి స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని కోరారు. అనంతరం ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల స్ఫూర్తితో దేశ సమగ్రత పై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.దేశ స్వతంత్రం కోసం వారు చేసిన త్యాగం వెలకట్టలేనిది అన్నారు. భగత్ సింగ్ తమ సహచరులు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఉరితీయబడినవారు. వారు కలలుగన్న దేశ సౌర్వభౌమా ధికారం, లౌకికవాదం సమానత్వం కోసం పోరాడుతున్న ఎందరికో గొప్ప స్ఫూర్తి అని తెలిపారు.

స్వతంత్ర ఉద్యమంలో గొప్ప పాత్ర వీరిది..

సామ్రాజ్యవాదానికి పెట్టుబడుదారి వ్యవస్థకు భూస్వామ్య సమాజానికి, మతోన్మాదానికి, కులతత్వాలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడు స్ఫూర్తినిస్తున్న విప్లవ వీరులు అని కొనియాడారు. కుల వ్యవస్థను కుప్పకూలచాల్సిన అవసరం గురించి భగత్ సింగ్ అతని సహచరులు కోరుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భగత్ సింగ్ తన సహచరులు మతోన్మాదాన్ని అన్ని స్థాయిలోనూ తీవ్రంగా వ్యతిరేకించారు అని ఆయన తెలిపారు .స్వతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ ఆయన సహచరుల పాత్ర చాలా గొప్పది అని చెప్పారు.దేశ ,సౌర్వభౌమధికారం ,లౌకికవాదం ,సమానత్వం కోసం వారు చేసిన కృషి వారు పడ్డ తపన చాలా గొప్పది అన్నారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్ ల 95 వ వర్ధంతి సందర్భంగా దేశ ఐక్యత కోసం ప్రజలను విడగొట్టే మతోన్మాద విధానాలపై ఐక్యంగా కదలని దాని కోసం ప్రజాసామికవాదులు, మేధావులు ,యువకులు, విద్యార్థులు అన్ని వర్గాల ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానం విధానానికి మరియు డ్రగ్స్ యువత చెడు అలవాట్లకు దూరం కొనడం కోసం కృషి చేయాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా అధ్యక్షులు ఆకుల మనోజ్ సాయి రాజు మహేష్ శ్రావణ్ జీవన్ అంజి అరుణ్ గణేష్ ఉమామహేశ్వర్ అభిలాష్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News