కోర్టు క్రేజీ తీర్పు జరిమానా కట్టలేరా? అయితే 'సేవ' చేయండి!
కరీంనగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కోర్టు వినూత్న శిక్ష విధించింది. జరిమానా కట్టలేకపోయిన ఇద్దరు వ్యక్తులకు 3 మరియు 6 రోజుల పాటు సామాజిక సేవ.
కోర్టు క్రేజీ తీర్పు జరిమానా కట్టలేరా? అయితే 'సేవ' చేయండి!
కరీంనగర్/క్రైమ్ డెస్క్: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఇద్దరికి జరిమానా, చెల్లించనందుకు ఇద్దరు నిందితులకు ఒకరికి 03రోజుల సామాజిక సేవ, మరొకరికి 06రోజుల సామాజిక సేవ శిక్ష విధించిన న్యాయమూర్తి.
వినూత్న శిక్ష ఖరారు చేసిన కోర్టు..
కరీంనగర్ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడి, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు వినూత్న శిక్ష ఖరారు చేసింది. నిబంధనల అతిక్రమణకు గానూ విధించిన జరిమానా చెల్లించడంలో విఫలమైనందుకు, సదరు వ్యక్తుల ఇద్దరికీ, ఒకరికి 03 రోజుల సామాజిక సేవ, మరొకరికి 06 రోజుల పాటు పోలీసుల పర్యవేక్షణలో సామాజిక సేవ చేయాలని కోర్టు ఆదేశించింది.
కేసు వివరాలు..
రాజస్థాన్ కు చెందిన, కరీంనగర్ లో నివాసముంటూ, హోటల్ లో పనిచేస్తున్న చెందిన తేజ్ సింగ్ (35) ను, మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఘటనలో సోమవారం కరీంనగర్ గౌరవనీయ II స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్, శ్రీమతి డాక్టర్ ఈదుల లక్ష్మీ గారు విచారించారు. విచారణ అనంతరం నిందితుడికి రూ. 2,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే, నిందితుడు జరిమానా మొత్తాన్ని చెల్లించలేకపోయాడు.
దీంతో కోర్టు ఆదేశాల మేరకు, నిందితుడు మార్చి 23 నుండి మార్చి 27 వరకు (3 రోజుల పాటు) మరియు తిమ్మాపూర్ కు చెందిన బోనాల సాయికృష్ణను కూడా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఘటనలో విచారించి 5000 జరిమానాతో పాటు, 06 రోజుల పాటు కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సామాజిక సేవ (Social Service) చేయాల్సి ఉంటుంది. సంబంధిత పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఈ శిక్షను అనుభవించేందుకు నిందితలు అంగీకరించి హాజరయ్యారు.
పోలీస్ కమీషనర్ హెచ్చరిక..
"ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరి భద్రత కోసమే రూపొందించబడ్డాయి. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, జరిమానాలు లేదా కోర్టు ద్వారా ఇటువంటి కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని" కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు.