జగదీశ్వరరావుకు ప్రమోషన్.. కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దారుగా రాముడు

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల నూతన తాసిల్దారుగా రాపేల్లి రాముడు బాధ్యతలు చేపట్టారు.

Update: 2026-03-23 14:04 GMT

జగదీశ్వరరావుకు ప్రమోషన్.. కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దారుగా రాముడు

కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తాసిల్దారుగా రాపేల్లి రాముడు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పెద్దపల్లి ఆర్డీఓ (RDO) కార్యాలయంలో పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది.

ఇక్కడ తాసిల్దారుగా సేవలందించిన పుల్లూరి జగదీశ్వరరావుకు పదోన్నతి లభించింది. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని సీతారామ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాముడుకు తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News