Revanth Reddy: పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ ఉన్నారని సమాచారం అందింది
Revanth Reddy: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో కేటీఆర్ పీఏ సొంత మండలం మాల్యాలలో..
Revanth Reddy: పేపర్ లీక్‌లో కేటీఆర్ పీఏ ఉన్నారని సమాచారం అందింది
Revanth Reddy: పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ పీఏపై కూడా పేపర్ లీక్ ఆరోపణలు ఉన్నాయన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో కేటీఆర్ పీఏ సొంత మండలం మాల్యాలలోని వంద మందకి వందకు పైగా మార్కులొచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. అందుకే కేటీఆర్ పీఏపై అనుమానాలున్నాయన్నారు రేవంత్‌రెడ్డి.
పేపర్ లీక్‌పై నిందితుల విచారణ కూడా ప్రారంభం కాకుండా.. ఇద్దరే నిందితులు అని మంత్రి కేటీఆర్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇద్దరే నిందితులని ప్రకటించి.. బీఆర్ఎస్‌లో ఉన్న పెద్ద తలల్ని కాపాడారని ఆరోపించారు. కేటీఆర్ తన ప్రకటనతో సిట్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారన్నారు రేవంత్ రెడ్డి.