జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. పదవీ విరమణకు ఒకరోజు ముందు కీలక తీర్పునిచ్చిన సీజేఐ..

CJI NV Ramana: హైదరాబాద్‌ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది.

Update: 2022-08-25 09:49 GMT

జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌.. పదవీ విరమణకు ఒకరోజు ముందు కీలక తీర్పునిచ్చిన సీజేఐ..

CJI NV Ramana: హైదరాబాద్‌ జర్నలిస్టులకు పదవి విరమణకు ఒక రోజు ముందు సీజేఐ ఎన్వీ రమణ తీపి కబురు అందించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు పచ్చజెండా ఊపారు. ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లకు ఇళ్ల స్థలాల వ్యవహారంతో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల వ్యవహారం ముడిపెట్టరాదని స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తాను వ్యాఖ్యలు చేయడంలేదని, కానీ ఓ చిరు పాత్రికేయుడు ఎందుకు ఇబ్బంది పడాలి? అని సూటిగా ప్రశ్నించారు.

రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. వారికి భూమి కేటాయించారు. కానీ అభివృద్ధి చేయలేదన్నారు. వారంతా కలిసి స్థలం కోసం రూ. 1.33 కోట్లు డిపాజిట్ చేశారని, జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకోడానికి మేం అనుమతిస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయండని ఆయన సూచించారు.

Tags:    

Similar News