10th Exams: కమలాపూర్ టెన్త్ హిందీ పేపర్‌లీక్ కేసులో విద్యార్థి హరీష్‌కు ఊరట
10th Exams: మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలన్న కోర్టు
10th Exams: కమలాపూర్ టెన్త్ హిందీ పేపర్‌లీక్ కేసులో విద్యార్థి హరీష్‌కు ఊరట
10th Exams: కమలాపూర్ టెన్త్ హిందీ పేపర్‌లీక్ కేసులో విద్యార్థి హరీష్‌కు ఊరట లభించింది. మిగతా పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ ఆరోపణలతో హరీష్‌ను డిబార్ చేశారు. అయితే.. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు విద్యార్థి హరీష్ తండ్రి. హరీష్ హిందీ పరీక్ష రాస్తున్నప్పుడు ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని, కమలాపూర్ ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఎక్కడా హరీష్ పేరు లేదని కోర్టుకు తెలిపారు. అధికారులు హరీష్‌ను నిన్నటి పరీక్ష కూడా రాయనివ్వలేదని చెప్పారు. హరీష్‌ను రాజకీయాలకు బలి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి హరీష్ తండ్రి. దీనిపై విచారణ చేసిన హైకోర్టు.. సోమవారం నుంచి హరీష్‌ను పరీక్షలు రాయనివ్వాలని ఆదేశించింది.