ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ దందా.. మహారాష్ట్రకు యధేచ్ఛగా...

Adilabad: *ఇచ్చోడ మండల కేంద్రంలో భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత *ఓ గోదాంలో అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం సీజ్‌

Update: 2022-03-27 03:00 GMT

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ దందా.. మహారాష్ట్రకు యధేచ్ఛగా...

Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు సరిహద్దునే మహారాష్ట్ర ఉండడంతో రేషన్ బియ్యం యదేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసులు అడపాదడపా దాడులు నిర్వహించి అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఒకచోట పీడీఎస్ బియ్యం పట్టుబడుతూనే ఉన్నాయి.

కొందరు రేషన్ డీలర్లు ప్రజల నుండే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఆరోపణలు సైతం లేకపోలేదు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నారు. బాద్యులైన వారిపై కేసు కూడా నమోదు చేశారు. మహారాష్ట్రకు రేషన్ బియ్యం తరలిస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఇటీవల గంజాయి టోల్ ప్లాజా వద్ద వంద క్వింటాళ్లు, బైంసా టోల్ ప్లాజా వద్ద 68 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.

Tags:    

Similar News