Rajgopal Reddy: నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు
Rajgopal Reddy: త్వరలో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారు
Rajgopal Reddy: నేను హోంమంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్‌లో ఉంటారు
Rajgopal Reddy: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చిట్‌చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని.. తనకు హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నానన్నారు రాజగోపాల్‌రెడ్డి. తాను కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకన్న రాజగోపాల్‌రెడ్డి.. హోంమంత్రి అయితేనే BRS నేతలు కంట్రోల్‌లో ఉంటారన్నారు. త్వరలో బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తారని.. కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామరక్ష అంటూ సెటైర్ వేశారు.
బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నల్గొండలో తమ కుటుంబం నుంచి ఎంపీగా పోటీలో ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం.. లేకపోతే పార్టీ ప్రకటించిన వారిని గెలిపిస్తామన్నారు రాజ్‌గోపాల్‌రెడ్డి.