చల్లబడిన వాతావరణం..హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. అప్పటివరకూ సెగలు కక్కిన భానుడు ఒక్కసారిగా కనుమరుగయ్యాడు.

Update: 2025-04-10 10:40 GMT

Rain Alert: ముంచుకొస్తున్న ముప్పు..ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. అప్పటివరకూ సెగలు కక్కిన భానుడు ఒక్కసారిగా కనుమరుగయ్యాడు. ఎండ తాపానికి ఉక్కిరిబిక్కిరి అయిన నగర వాసులు తెరచాటున దాగి ఉన్న వరణుడు ఒక్కసారిగా తెరపైకి రావడంతో నగరంపై మేఘాలు కమ్ముకున్నాయి. మారిన వాతావరణంతో మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్‌పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ సనత్‌నగర్, అమీర్‌పేట్‌లో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా కురిసిన వానకు నగరవాసులు ఎండ నుంచి స్పల్ప ఊరట పొందారు. 

క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నగరంలో రానున్న 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

Tags:    

Similar News