Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Alert: 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 13 జిల్లాల్లోనూ రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.