Rahul Gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: రేపు జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్న రాహుల్
Rahul Gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
Rahul Gandhi: నేడు, రేపు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం కొల్లాపూర్‌లో జరిగే పాలమూరు ప్రజాభేరి సభలో పాల్గొని రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అనంతరం రాహుల్ హైదరాబాద్ కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. రేపు కల్వకుర్తి సభలో పాల్గొననున్న రాహుల్ అనంతరం జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. అక్కడ నుంచి షాద్‌నగర్ పట్టణంలో పాదయాత్ర అనంతరం కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 3వ తేదీ నుంచి ఎన్నికల నామినేషన్లు ఉండటం వల్ల 2వ తేదీన తెలంగాణలో జరిగాల్సిన రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.తిరిగి నామినేషన్ల తర్వాత రాహుల్ గాంధీ పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.