Nalgonda: నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్
Nalgonda: నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. గత నెల 31న హాస్టళ్లలో MBBS ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేశారని.. ఈనెల 4న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినా ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ పట్టించుకోవడం లేదని జూనియర్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారని.. మరోసారి జూనియర్లపై సీనియర్ విద్యార్థులు దాడులకు పాల్పడ్డట్టు తెలుస్తుంది.
కాలేజీ హాస్టల్‌లో ఇంత జరిగుతున్నా.. కాలేజ్ ప్రిన్సిపల్ మాత్రం ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. కాగా.. విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి సమస్య సద్దుమణిగేలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఉన్నతాధికారులు కలగజేసుకొని విచారణ చేయాలని బాధిత జూనియర్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది ఇదే కాలేజీలో ర్యాగింగ్ కేసులో ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశారు.