Priyanka Gandhi: ఇవాళ తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
Priyanka Gandhi: గిరిజనులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం
Priyanka Gandhi: ఇవాళ తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
Priyanka Gandhi: ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకాగాంధీ ఇవాళ ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.30 గంటలకు ఖానాపూర్ చేరుకోనున్న ప్రియాంక అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఆసిఫాబాద్ చేరుకుని ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. నాగోబా దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి సమీపంలోని తండాలో మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీల గురించి ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి గిరిజనుల ప్రత్యేక వంటకాలు వండి భోజనం చేస్తారు. వారితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారు. అనంతరం ప్రియాంక నాందేడ్ తిరిగి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.