Priyanka Gandhi: నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రచారం

Update: 2023-10-31 03:39 GMT

Priyanka Gandhi: నేడు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పాదయాత్రలు, సభలు, బస్సు యాత్ర చేపట్టి తమ ఆరు గ్యారెంటీలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక బస్సు యాత్రను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ప్రారంభించింది. అయితే ఇప్పుడు మరోసారి ప్రియాంక రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఆకర్షించనున్నారు.

ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఇవాళ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న ప్రియాంక.. మొదట అక్కడి మహిళలతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం సాయంత్రం కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభకు వెళ్లి అక్కడ ప్రసంగిస్తారు. పీసీసీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రియాంక ప్రచారం చేయనున్నారు.

మరోవైపు ఇప్పటికే బస్సు యాత్రలో భాగంగా మూడ్రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించారు. ఇప్పుడు మరోసారి ప్రియాంక రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న ప్రియాంక.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. 

Tags:    

Similar News