Priyanka Gandhi: బేగంపేటకు చేరుకున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు

Update: 2023-05-08 10:16 GMT

Priyanka Gandhi: బేగంపేటకు చేరుకున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్ ఫోర్ట్‌లో ప్రియాంక గాందీకి..హస్తం నేతలు ఘన స్వాగతం పలికారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గాన ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగే ఈ సభలో ప్రియాంకగాంధీ ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. స్పెషల్ ఫ్లైట్లో ప్రియాంక బేగంపేటకు రానున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గాన ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా ఇటీవలి కాలంలో వివిధ ప్రమాదాల్లో చనిపోయిన కాంగ్రెస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా సాయం అందించనున్నారు. ప్రియాంక ప్రసంగం 20 నుంచి 25 నిమిషాలపాటు ఉండనుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగుల కోసం చేపట్టే కార్యక్రమాలను ఈ డిక్లరేషన్‌లో పొందుపర్చనున్నారు. నిరుద్యోగుల బహిరంగ సభలో ప్రియాంక గాంధీ... యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రియాంక పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ప్రియాంకగాంధీ పర్యటనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

Tags:    

Similar News