Narendra Modi: హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన
Narendra Modi: ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని
హైదరాబాద్‌లో ప్రధాని మోడీ పర్యటన
Narendra Modi: ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రి తలసానితో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు చేరుకున్నారు మోడీ. ఇక్రిశాట్ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న మోడీ కాసేపట్లో ఇక్రిశాట్ కొత్త లోగోను ఆవిష్కరించనున్నారు. అనంతరం.. శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.