ఈ రోజు నుండి ప్రాణహిత పుష్కరాలు.. నాలుగు జిల్లాల్లో పుష్కర ఘాట్లు...

Pranahita Pushkaralu 2022: మూడు రాష్ట్రాల సరిహద్దు నాలుగు జిల్లాల్లో పుష్కర ఘాట్లు...

Update: 2022-04-13 02:32 GMT

ఈ రోజు నుండి ప్రాణహిత పుష్కరాలు.. నాలుగు జిల్లాల్లో పుష్కర ఘాట్లు...

Pranahita Pushkaralu 2022: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరగబోతున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు ఈ రోజు నుంచి 24 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయి. 2010 తర్వాత స్వరాష్ట్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. తెలంగాణ–మహారాష్ట్ర–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు.. గడ్చిరోలి, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఈ పుష్కరాలు జరగనున్నాయి.

కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణీ సంగమం కలయికతో ప్రాణహిత నది పుట్టింది. తుమ్మిడి హెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలో మీటర్లు ప్రవహిస్తుంది. ప్రాణహిత నది ఎక్కువగా తెలంగాణ-మహారాష్ట్రకి సరిహద్దులోప్రవహిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లో తుమ్మిడిహెట్టి నుంచి కాళేశ్వరం వరకు ఎంతో ఘనంగా పుష్కరాలను నిర్వహించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాణహిత నది పుష్కరాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు. మహరాష్ర్ట ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

మరో వైపు ప్రాణహిత పుష్కర ఏర్పాట్లపై ఇప్పటికే రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పుష్కర ఏర్పాట్లు, పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇతరపూజా కార్యక్రమాలపై చర్చించారు. జయంశకర్ జిల్లా కాళేశ్వరం దగ్గర భక్తులరద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రాణహిత పుణ్యనది పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సమీప ప్రాంతవాసులు కోరుతున్నారు. 

Tags:    

Similar News