Corona Cases in Telangana: రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Corona: తెలంగాణ రాష్ట్రంలో రోజుకి వేలల్లో కేసులు నమోదు * అప్రమత్తమై ఆంక్షలు విధిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Update: 2021-04-11 08:23 GMT

ఫైల్ ఇమేజ్ 

Corona Cases in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా మొదట్లో వచ్చినప్పుడు దగ్గు ,జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో మాత్రం అవేవి కనిపించడం లేదు. కరోనా ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ లక్షణాలకి ఎలాంటి సంబంధం ఉండడం లేదని అంటున్నారు వైద్యులు.

సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజుకి వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమై సూచనలు జారీ చేసింది. మరో వైపు రాష్ట్రాలు సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. మొదట్లో వచ్చిన కరోనా కి ఇప్పుడు వస్తున్న కరోనా కి అసలు పొంతన లేదని రెండింటికి చాలా తేడా ఉందని వైద్యులు అంటున్నారు.

కరోనా మొదట్లో వచ్చినప్పుడు దగ్గు, గొంతు నొప్పి, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉండేవి. కానీ ఇప్పుడు అవేవి లేకుండా కరోనా పాజిటివ్ వస్తుందని అంటున్నారు వైద్యులు. కరోనా అతి ప్రమాదకారమైంది కాబట్టి అందరు కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అంటున్నారు.

కరోనా మొదట్లో వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు కానీ ఇప్పుడు ఎవరు బయపడ్డాం లేదని అందు వలనే కేసులు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. మొదట్లో కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్స్ కి వచ్చి టెస్టులు చూపించుకునే వారని కానీ ఇప్పుడు ఎవరు టెస్టులు చేపించుకోవడానికి ఆసక్తి చేపడం లేదని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అతి ప్రమాదకారిగా మారింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరిని ఆవహిస్తోంది. ఈ సమయం చాల క్లిష్టమైందని అందరూ కోవిడ్ నిబంధనల్ని తుచ తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News