Ponnam Prabhakar: కేటీఆర్ వ్యాఖ్యలు హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది
Ponnam Prabhakar vs KTR: సిరిసిల్లలో సర్పంచుల ఆత్మీయ సభలో కేటీఆర్ కామెంట్స్
Ponnam Prabhakar: కేటీఆర్ వ్యాఖ్యలు హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది
Ponnam Prabhakar: సర్పంచుల పెండింగ్ బిల్లుల అంశం.. ఇప్పుడు మంత్రి పొన్నం, మాజీమంత్రి కేటీఆర్ మధ్య మాటల తూటాలకు దారి తీసింది. సిరిసిల్లలో సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతానన్నారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలకు 'ఎక్స్'లో మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు హంతకులే సంతాప సభ పెట్టినట్టుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో బిల్లులు రాక సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోలేదా..? అని ప్రశ్నించారు. సర్పంచ్‌లను పనుల పేరుతో వేధించింది నిజం కాదా..? అంటూ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ హయాంలో 11 వందల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి.. 20 మంది సర్పంచ్‌ల ఆత్మహత్యకు కారణమయ్యారని మంత్రి పొన్నం ఆరోపించారు.