Ponnam Prabhakar: ఓట్లు వెయ్యకపోతే భార్యాపిల్లలను చంపుకుంటామనే వాళ్లు.. సభలో ఉండాల్సిన అవసరంలేదు
Ponnam Prabhakar: 12 ఏళ్ల పాపతోనూ ఇవే వ్యాఖ్యలు చేయించారు
Ponnam Prabhakar: ఓట్లు వెయ్యకపోతే భార్యాపిల్లలను చంపుకుంటామనే వాళ్లు.. సభలో ఉండాల్సిన అవసరంలేదు
Ponnam Prabhakar: ఇరిగేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం కాలువలను సైతం సెట్ చేయలేకపోతుందన్న కడియం వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి పొన్నం రిప్లయ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే పదేళ్లుగా సిరిసిల్లకు అన్యాయం చేశారంటూ కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు పొన్నం. అటు పొన్నం మాట్లాడుతుండగా కూర్చూ కూర్చో అంటూ కేటీఆర్ మాట్లాడారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం.. మాట్లాడేది వినాలని లేకపోతే సభ నుంచి వెళ్లిపోవచ్చని హాట్ కామెంట్స్ చేశారు. ఓట్లు వెయ్యకపోతే భార్యాపిల్లలను చంపుకుంటామనే వాళ్లు సభలో ఉండాల్సిన అవసరంలేదని దుయ్యబట్టారు. శవయాత్ర చూస్తారని బ్లాక్ మెయిల్ చేసేవారు ఎలా మాట్లాడుతారని ఎద్దేశా చేశారు. 12 ఏళ్ల పాపతోనూ ఇవే వ్యాఖ్యలు చెప్పించారని.. ఆమె మానసిక పరిస్థితి ఏమవ్వాలని ప్రశ్నించారు.