Ponnam Prabhakar: మహిళా లోకం తలవంచుకునేలా కవిత లిక్కర్ స్కామ్
Ponnam Prabhakar: కవితను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదు
Ponnam Prabhakar: మహిళా లోకం తలవంచుకునేలా కవిత లిక్కర్ స్కామ్
Ponnam Prabhakar: దేశంలో బీజేపీని విమర్శించిన ఏ పార్టీని కూడా బీజేపీ వదిలిపెట్టలేదని మండిపడ్డారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మోడీ సాయంతో టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా 100కోట్ల లిక్కర్ స్కామ్‌పై చర్చ జరుగుతోందన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ఉండేందుకు లిక్కర్ స్కామ్‌పై చర్చ అన్నారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చేలా కవిత లిక్కర్ స్కామ్‌కు పాల్పడిందని.. కవితను అరెస్ట్ చేయడంలో బీజేపీ ఎందుకు జాప్యం చేస్తుందో చెప్పాలన్నారు. ఎవరు అవినీతికి పాల్పడిన శిక్షిస్తానన్న సీఎం కేసీఆర్.. లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు ఉన్నా ఎందుకు పార్టీ నుండి బహిష్కరించలేదన్నారు పొన్నం ప్రభాకర్.