Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Ponnam Prabhakar: ప్రభుత్వం ఏర్పడి వారం పూర్తికాకముందే ఇలాంటి వ్యాఖ్యలు అర్ధరహితం
Ponnam Prabhakar: బీఆర్ఎస్, బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
Ponnam Prabhakar: ప్రజలు మార్పు కోరుకున్నారే కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని చెప్పడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం ఏర్పడి వారం పూర్తికాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి సంయుక్తంగా పని చేద్దామంటూ పిలుపునిచ్చారు. ప్రతిసారి నెగెటివ్ మాటలు మాట్లాడకుండా నోరు అదుపులోకి ఉంచుకోవాలని కోరారు.