Ponnam Prabhakar: కేటీఆర్ రాజీనామా చేస్తే పోటీ చేయడానికి సిద్ధం
Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు...
Ponnam Prabhakar: కేటీఆర్ రాజీనామా చేస్తే పోటీ చేయడానికి సిద్ధం
Ponnam Prabhakar: కేటీఆర్ రాజీనామా చేస్తే పోటీ చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. మేడిగడ్డ కుంగడానికి బాధ్యులు ఎవరు అని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డను బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు. ఒక పిల్లర్ కూలిందని చెబుతున్నారని, కానీ ఇంట్లో ఒక పిల్లర్ కూలినా ఇల్లు కూలినట్లేనని గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.