Balkampet Temple: ప్రొటోకాల్ రగడ.. అలిగి గుడిబయటే కూర్చున్న మంత్రి, మేయర్
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వ తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు.
Balkampet Temple: ప్రొటోకాల్ రగడ.. అలిగి గుడిబయటే కూర్చున్న మంత్రి, మేయర్
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వ తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే పట్టువస్త్రాల సమర్పణ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ నిర్వాహకులు, అధికారులు పొన్నం, మేయర్ ను రిసీవ్ చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించారు.
ఈ సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకోవటంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ప్రోటోకాల్ రగడ వివాదం తలెత్తింది. ఆలయ నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహంతో ఆలయం వద్దనే పొన్నం, మేయర్ బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. దీంతో ఆలయ చైర్మన్, ఆలయ నిర్వాహకులు అక్కడకు చేరుకొని వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు.