Polling Close: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్
Polling Close: క్యూలైన్‌లో ఉన్న వారికి మాత్రమే అవకాశమిచ్చిన అధికారులు
Polling Close: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన పోలింగ్
Polling Close: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఐదు గంటల లోపు క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మెదక్‌లో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా... హైదరాబాద్‌లో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది.
తొలి 2 గంటల్లో కేవలం 7శాతం మాత్రమే ఉన్న పోలింగ్.. 11 గంటలు దాటేసరికి.. 20 శాతం దాటింది. ఒంటిగంట వరకు 36.68 శాతం పోలింగ్ నమోదవగా.. ఆ తర్వాత పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదైంది.