యాదాద్రిలో ప్రమాణం కోసం వెళ్లడానికి సిద్ధమవుతున్న బండి సంజయ్
Bandi Sanjay: బండి సంజయ్ యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం
యాదాద్రిలో ప్రమాణం కోసం వెళ్లడానికి సిద్ధమవుతున్న బండి సంజయ్
Bandi Sanjay: ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హీట్ పుట్టిస్తున్నారు. యాదాద్రిలో ప్రమాణానికి సీఎం కేసీఆర్ రావాలని నిన్న బండి సంజయ్ సవాల్ విసిరారు. ఆ మేరకు యాదాద్రిలో ప్రమాణం కోసం వెళ్లడానికి బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. సంజయ్ యాదాద్రికి వెళ్లకుండా మర్రిగూడలో భారీగా పోలీసులను మోహరించారు. యాదాద్రికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు యాదాద్రికి వెళ్లేందుకు సంజయ్ ప్రయత్నాలు.. మరోవైపు పోలీసుల మోహరింపుతో మర్రిగూడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.