మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు: ఏసీపీ
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మొదటి రోజు నామినేషన్లు పురస్కరించుకొని, మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తును పోలీస్ మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పర్యవేక్షణ చేసారు.
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మొదటి రోజు నామినేషన్లు పురస్కరించుకొని, మున్సిపల్ కార్యాలయం వద్ద బందోబస్తును పోలీస్ మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారి సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పర్యవేక్షణ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు రాష్ట్ర ఎన్నికల సంఘం, నిర్దేశించిన ప్రకారం నామినేషన్లు వెయ్యాలని సూచించారు.
నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థితో యుక్తంగా నలుగురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, పర్మిషన్ లేకుండా ఎలాంటి ర్యాలీలు తీయకూడదని తెలిపారు. వేరే వారు ఎవరు లోపలికి రావద్దని సూచించారు. పోలీసు వారి సలహాలు సూచనలు పాటించాలని, వివిధ రాజకీయ పార్టీ అభ్యర్థులకు సూచించారు. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులు, 41 పోలింగ్ బూతులు, 15 పోలింగ్ కేంద్రాలు కలవు.
ఈ రోజు వరకు గత ఎన్నికల్లో కేసులు నమోదైన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని మున్సిపల్ ఎన్నికల పరిధిలో ఉన్న వారిని 28 మందిని బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు.ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ల గురించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక సిఐ హరికృష్ణ, ఎస్సై స్వామి, భూంపల్లి ఎస్సై మమ్మద్ సర్దార్ జమాల్, సర్కిల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.