YS Sharmila: మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు

YS Sharmila: వైఎస్ షర్మిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

Update: 2023-02-19 03:42 GMT

YS Sharmila: మహబూబాబాద్ జిల్లాలో వైఎస్ షర్మిలను అరెస్టు చేసిన పోలీసులు

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్నటి బహిరంగ సభలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య విడాకులు ఇవ్వాలని షర్మిల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సాలార్ తాండా నైట్ క్యాంప్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా వైఎస్ షర్మిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు నమోదయింది. ఈ నేపథ్యంలో షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. అనుమతి రద్దుకు సంబంధించిన నోటీసులు వైఎస్ షర్మిలకు ఇచ్చేందుకు పోలీసుల ప్రయత్నించారు. ఇదిలా ఉండగా షర్మిల పాదయాత్రను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు నైట్ క్యాంప్ వద్దకు భారీ ఎత్తున బయల్దేరారు. పాదయాత్రను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచరులు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసుల మోహరించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ప్రస్తుతం పరిస్తితి ఉద్రిక్తంగా మారింది.

Tags:    

Similar News