తెలంగాణలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటీ
PM Modi: ఎన్నికల ముందు ప్రధాని చేత పసుపు బోర్టు ప్రకటన
తెలంగాణలో పసుపు బోర్డు.. గిరిజన వర్సిటీ
PM Modi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు హామీలపై ఫోకస్ చేశాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు స్టార్ట్ చేశాయి. ఇక తెలంగాణలో అధికారమే టార్గెట్‌గా బీజేపీ దూకుడు పెంచింది. ప్రధాని మోడీతో సభ నిర్వహించి హామీల వర్షం కురిపించింది రాష్ట్ర బీజేపీ. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డును ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.
ఉత్తర తెలంగాణలో మరోసారి తన బలాన్ని నిరూపించుకోవడానికి మళ్లీ ఎత్తుగడను మొదలుపెట్టింది తెలంగాణ బీజేపీ. అసెంబ్లీ ఎన్నికలకు కొన్నినెలల ముందు ప్రధాని మోడీ చేత పసుపు బోర్డు ప్రకటన చేయించి.. అందరి అటెన్షన్‌ను తమవైపునకు తిప్పుకుంది. అయితే ఇదే సందర్భంలో తెలంగాణలో పుంజుకోవడానికి బీజేపీ అధిష్టానం వ్యూహం మార్చిందా అనే చర్చకు దారి తీసింది. అసెంబ్లీ ఎన్నికల కోసం మేజర్ హామీలు ఇప్పటివరకు ప్రకటన చేయకుండా ఎదురుచూసింది.
అయితే ఎన్నికల ముందు పెండింగ్ హామీల ప్రకటనతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తున్నాయి. అయితే పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుండడంతో బీజేపీ అలర్ట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పసుపు బోర్డు డిమాండ్ ఉన్న నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఇక గిరిజన యూనివర్సిటీ ప్రభావం ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లో ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది.
పసుపు బోర్డు ప్రకటన.. తెలంగాణలో బీజేపీకి మైలేజ్ ఇస్తుందా... వచ్చే ఎన్నికల్లో పసుపు రైతుల మద్దతు ఎవరికి.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మరోసారి పోటీ హోరాహోరీగా ఉండబోతోందా.. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పసుపు బోర్డు ప్రకటనతో తెలంగాణ బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది.