IAS, IPS బదిలీలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

*జూన్‌ 5న విచారణ జరపుతామన్న హైకోర్టు

Update: 2023-04-12 12:46 GMT

IAS, IPS బదిలీలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

High Court: తెలంగాణలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలపై జూన్‌ 5న విచారణ చేపట్టనుంది. బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం తెలంగాణ హైకోర్టును కోరగా.. జూన్‌ 5న విచారణ చేస్తామని తెలిపింది ధర్మాసనం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ,తెలంగాణలకు 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కేంద్రం కేటాయించింది. అయితే కేంద్ర ఉత్వర్వులపై అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి ఎక్కడికక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో క్యాట్ ఉత్వర్వులపై కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లిపోగా.. డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది బదిలీలపై ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News