Telangana: దెయ్యం భయంతో ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసిన వైనం

Telangana: గ్రామాన్ని వదిలి వెళ్లిన 40 కుటుంబాలు * జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారంలో ఘటన

Update: 2021-02-26 09:31 GMT

Ghost Fear in Potharam

Telangana: భయం అవును ఈ ఒక్క పదం మనిషిని ఏదైనా చేస్తుంది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామస్థులను ఈ దెయ్యం భయమే కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతెందుకు ఏకంగా ఊరు ఊరునే ఖాళీ చేయించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు పోతారం గ్రామాన్ని చూస్తే నిజమని నమ్మక తప్పదు. అయితే.. ఆ గ్రామంలో నిజంగానే దెయ్యం ఉందా? లేదంటే ఈ పుకార్ల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?

గత కొద్ది రోజులుగా పోతారం గ్రామంలో దెయ్యం తిరుగుతోందన్న భయం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతేకాదు ఈ దెయ్యం ఏకంగా గ్రామంలోని యువకులపై అత్యాచారం చేస్తోందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఏకంగా నాలబైకి పైగా కుటుంబాలు ఇండ్లకు తాళం వేసి మండల కేంద్రానికి మకాం మార్చారు.

అయితే.. ఈ దెయ్యం పుకార్ల వెనుక ఓ విస్తుగొలిపే నిజం ఉందన్న ఊహాగానాలు ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఓ మూఢనమ్మకాన్ని గ్రామంలోకి వదిలేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిలు మొదలుపెట్టారు. అటు.. పోతారం సర్పంచ్ సైతం దెయ్యం వార్తలను కొట్టిపడేశారు.

మరోవైపు ఈ కాలంలోనూ మూఢనమ్మకాలతో ఏకంగా గ్రామాన్ని ఖాళీ చేయడం పట్ల జనవిజ్ఞాన వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మూఢనమ్మకాల పట్ల ఒక్క పోతారం గ్రామాన్నే కాదు.. అందరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. 

Tags:    

Similar News