కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికుల నిరసన

Visakhapatnam: సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ మేసేజ్‌లు పంపుతున్న కార్మికులు.

Update: 2022-02-18 08:14 GMT

కొనసాగుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మికుల నిరసన

Visakhapatnam:  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలంటూ చేస్తున్న పోరాటం 369వ రోజుకు చేరింది. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని కార్మిక, ఉద్యోగ సంఘాలు తేల్చిచెబుతున్నాయి. ఇక వైజాగ్ స్టీల్ ఫౌండేషన్ సందర్భంగా నిరసనలు తెలుపుతూ మేసేజ్‌లు పంపాలని ఉక్కు అఖిలపక్ష పోరాట కమిటీ పిలుపునిచ్చింది. 1966 నుంచి పోరాటాలు, ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రంలో ఉన్న బీజేపి ప్రభుత్వం పూర్తి స్తాయిలో అమ్మకానికి పెట్టిందని అందోళన వ్యక్తం చేస్తున్నారు. 369 రోజులుగా నిరవధిక దీక్షలు చేస్తూ వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన కార్మికులు నేడు సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ మేసేజ్‌లు పంపిస్తున్నారు. సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తాననడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. 

Tags:    

Similar News