Lashkar Bonalu: లష్కర్‌లో కొనసాగుతున్న బోనాల జాతర

Lashkar Bonalu:అమ్మవారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు * లష్కర్ బోనాలకు రానున్న సీఎం కేసీఆర్

Update: 2021-07-25 08:26 GMT

లష్కర్ బోనాలు (ఫోటో ది హన్స్ ఇండియా)

Lashkar Bonalu: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల జాతర కొనసాగుతుంది. అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు జరుగుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. కోవిడ్ ఎఫెక్ట్ తో గతసారి కంటే ఈ సారి భక్తుల రద్దీగా కాస్తంత తగ్గింది.

ఉదయం నాలుగు గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పిస్తే.. ప్రభుత్వం తర్వాత అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు.. ఉజ్జయిని మహంకాళిని హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మందక్రిష్ణతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మరోవైపు.. ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారిని సీఎం కేసీఆర్ సతిమణి శోభ దర్శించుకున్నారు. అంతకుముందు ఆమె డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి వెళ్లారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఆమెతో పాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా అమ్మావారిని దర్శించుకున్నారు. 

Tags:    

Similar News