ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫేక్ విమెన్ అకౌంట్‌తో అమ్మాయిలపై వల.. ఫొటోలు పంపించమని బెదిరింపు..

Instagram - Fake Account: కీచక కామాంధుడు అజయ్‌ని అరెస్ట్ చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు...

Update: 2021-12-23 11:44 GMT

ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఫేక్ విమెన్ అకౌంట్‌తో అమ్మాయిలపై వల.. ఫొటోలు పంపించమని బెదిరింపు..

Instagram - Fake Account: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుంటాడు.. ఆ తర్వాత ఫొటోలు పంపమని రిక్వెస్ట్ చేస్తాడు.. సరిగ్గా అప్పుడే తన శాడిస్ట్ రూపం చూపించి, నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫేక్ విమెన్ అకౌంట్‌ క్రియేట్ చేసి, యువతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఓ కీచక కామాంధుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నరరూప రాక్షసుడిని విచారించిన పోలీసులు దిమ్మదిరిగే నిజాలు వెల్లడించారు. తనను తాను అమ్మాయిగా ఫేక్ అకౌంట్‌తో పరిచయం చేసుకుని, న్యూడ్ ఫొటోలు పంపించకపోతే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున అమ్మాయిలను వేధించినట్లు పోలీసు విచారణలో తేలింది.

మరోవైపు.. 15 రోజుల క్రితం ఓ అమ్మాయి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నిన్న అర్థరాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వరంగల్‌ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్‌గా గుర్తించారు. మల్టీమీడియా చదువుకుంటూ, నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News