Non Veg: పండగ వేళ కొండెక్కిన నాన్‌వెజ్ ధరలు
Non Veg: పట్టీనట్టనట్లు ఆహార భద్రత శాఖ అధికారుల వ్యవహారం
పండుగ సందర్బంగా పెరిగిన నాన్ వెజ్ ధరలు (ఫైల్ ఇమేజ్)
Non Veg: పండగ వేళ నాన్‌వెజ్ ధరలు కొండెక్కాయి. దాని అదుపు చేయాల్సిన ఆహార భద్రత శాఖ అధికారుల పని తీరు అంతంత మాత్రమే అన్న నమ్మకంతో మాంసం విక్రయదారులు ఇష్టరాజ్యంగా ధరలు పెంచేసారు. వరంగల్ నగరంలో సాధారణ రోజుల్లో 230 నుంచి 250 రూపాయల వరకు విక్రయించే కేజీ చికెన్ ఇప్పుడు ఏకంగా 260 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే కిలో మటన్ 7 నుంచి 8 వందలు ఉండగా ప్రస్తుతం దాని ధర 9 వందలకు చేరింది. దసరా పండుగకు ఇంచుమించు ప్రతీ ఇంట్లో నాన్‌వెజ్ వండుతారు కాబట్టీ మాంసానికి డిమాండ్ పెరిగింది. దాంతో ఆకాశానికి చేరిన మటన్ ధరను అందుకోలేక సామాన్యులు ఉసూరుమంటున్నారు.
మరోవైపు స్థానికంగా వరంగల్ నగరంలో దొరకాల్సిన గొర్రెలు, మేకలు అందుబాటులో లేక అటు హైదరాబాద్, కర్నూలు, అనంతపూర్, ఘట్‌కేసర్ నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల మాంసం ధరలు పెరిగాయని మాంసం వ్యాపారులు అంటున్నారు. దానికి తోడు డీజల్ ధరలు పెరగంతో రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని చెప్పుకొస్తున్నారు.