ఖమ్మం జిల్లాలో విద్యార్ధులను వెంటాడుతున్న పాఠ్య పుస్తకాల కొరత

Khammam: పాఠశాలలు తెరిచి నెలలు గడుస్తున్నా పూర్తికాని పుస్తకాల పంపిణీ

Update: 2022-08-02 03:34 GMT

ఖమ్మం జిల్లాలో విద్యార్ధులను వెంటాడుతున్న పాఠ్య పుస్తకాల కొరత

Khammam: పాఠశాలు తెరచి నెలలు గుడుస్తున్నా ఖమ్మం జిల్లాలో పాఠ్యపుస్తకాలు విద్యార్ధులకు అందటంలేదు. పుస్తకాలు లేక విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పుస్తకాల పంపిణీ అడుగుమందుకు పడని తీరుపై HMTV స్పెషల్ ఫోకస్.

ప్రభుత్వ పాఠశాల్లో బడుల ప్రారంభం నాటికి, అన్ని తరగతుల విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అందజేయాల్సిన ప్రభుత్వం ఆ మేరకు దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 13న పాఠశాలలు ప్రారంభం కాగా ఇప్పటివరకూ 30శాతం విద్యార్ధులకు మాత్రమే పుస్తకాలు అందించారు. పూర్తిస్థాయిలో పుస్తకాలు రాకపోవడంతో మిగిలిన వారికి పుస్తకాలు అందలేదు. దీంతో తమ పిల్లల చదువులు సాగేదెలా అని విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఖమ్మం జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, పరిసరాల విజ్ఞానం, పర్యావరణ విద్యా, తదితర టైటిళ్ల పాఠ్యపుస్తకాలు మొత్తం కలిపి 8లక్షల 40వేల పుస్తకాలు కావాలని జిల్లా విద్యాశాఖ అధికారులు హైదరాబాద్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇప్పటి వరకూ సంగం పుస్తకాలు కూడా జిల్లాకు చేరలేదు.

ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది విద్యార్ధుల వద్ద ఇప్పటికి పాఠ్యపుస్తకాలు లేవు. ప్రతీ తరగతిలో 40శాతం మంది విద్యార్ధుల వద్ద మాత్రమే పూర్తిస్థాయిలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్ధులు చెబుతున్నారు. గతంలో పుస్తకాలు రావడం ఆలస్యమైనా పాత పుస్తకాలను పై తరగతికి వెళ్లిన విద్యార్ధుల నుండి సేకరించి చదువుకునే వారు. అయితే ఆ సంవత్సరం ద్విభాషా పుస్తకాలు కావడంతో ఆ అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. 

Tags:    

Similar News