Delta Plus Variant: నిజామాబాద్ వాసుల్లో డెల్టా వేరియంట్ భయం

Delta Plus Variant: నిజామాబాద్ ప్రజలను మహా భయం వెంటాడుతోంది.

Update: 2021-06-26 14:15 GMT

Delta Plus Variant: నిజామాబాద్ వాసుల్లో డెల్టా వేరియంట్ భయం

Delta Plus Variant: నిజామాబాద్ ప్రజలను మహా భయం వెంటాడుతోంది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు వెలుగు చూడడం, ఒకరు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలు జిల్లా ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. సెకండ్‌వేవ్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న వేళ ఏ క్షణాన ఎలాంటి ముప్పు ఎదరువుతుందో అన్న ఆందోళన జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది.

నిజామాబాద్ జిల్లాలో డెల్టా దడ మొదలైంది. మహారాష్ట్రను ఆనుకొని ఉండడంతో థర్డ్‌వేవ్ భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. ఇప్పటికే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు, తొలి మరణం సైతం మహారాష్ట్రలో వెలుగు చూడడం జిల్లా వాసుల్లో మరింత ఆందోళన పెంచుతోంది. డెల్టాప్లస్‌తో థర్డ్‌వేవ్ పక్కా అన్న హెచ్చరికల నేపధ్యంలో మహా సరిహద్దు జిల్లా నిజామాబాద్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఉండే పల్లెలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. దీంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో తనిఖీలు, టెస్టుల సంఖ్యను మరింత పెంచారు.

మరోవైపు నిజామాబాద్ వాసులకు మహారాష్ట్ర భయం ఇప్పటిది కాదు. కరోనా మొదటి దశ నుంచే జిల్లా వాసులను ఆ భయం వెంటాడుతోంది. జిల్లా వాసులకు మహారాష్ట్రతో బంధుత్వాలు ఉండడం, ఉపాధి కోసం నాందేడ్, ధర్మాబాద్, దెగ్లూర్ లాంటి సిటీలకు నిత్యం రాకపోకలు నడుస్తుండడంతో కరోనా క్యారియర్స్‌గా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెల్టాప్లస్ వేరియంట్‌పై మరోసారి జిల్లా వాసులను భయపెడుతోంది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుతున్నా ప్రజలు మరికొంత కాలం జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు.

ఇక మహారాష్ట్ర సరిహద్దుగా ఉండే బోదన్, జుక్కల్ డివిజన్ అధికారులు డెల్టాప్లస్ వేరియంట్ నేపధ్యంలో అలర్ట్ అయ్యారు. ఈ మహమ్మారి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టారు. డెల్టాప్లస్ అత్యంత ప్రమాదకరమని చెబుతున్న వైద్యులు ఇది వేరియంట్‌గా మారుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గమంటున్నారు.

ఫస్ట్, సెకండ్‌వేవ్‌ల ధాటికి ఇప్పటికే చిగురుటాకులా ఒణికిన ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు డెల్టాప్లస్ వేరియంట్ ప్రచారంతో మరోసారి ఉలిక్కి పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర - తెలంగాణ రాకపోకలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News