Black Fungus: నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్ కి అరుదైన సర్జరీ
Black Fungus: బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న మహిళకు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశారు.
Representational image
Black Fungus: బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న మహిళకు నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేశారు. 15 లక్షల ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్‌ను ఉచితంగానే చేసి రోగి ప్రాణాలను కాపాడారు. జిల్లా ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 27మందికి ఈఎన్‌టీ వైద్యులు చికిత్స అందించగా హబీబా అనే మహిళకు మాత్రం వ్యాధి తీవ్రత పెరిగింది. దవడ భాగంపై బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం చూపడంతో దాదాపు మూడు గంటలు శ్రమించి ఆపరేషన్ సక్సెస్ చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్ వెల్లడించారు.