KCR: కేసీఆర్‌తో కేటీఆర్, జగదీష్‌రెడ్డి భేటీ
KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న 'ఫోన్ ట్యాపింగ్' కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న 'ఫోన్ ట్యాపింగ్' కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ సిట్ (SIT) ఇచ్చిన నోటీసులపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. తనకు కొంత సమయం కావాలని కోరుతూ దర్యాప్తు సంస్థకు ఆయన లేఖ రాశారు.
సమయం కోరిన కేసీఆర్:
సిట్ నోటీసుల ప్రకారం కేసీఆర్ శుక్రవారం (జనవరి 30) విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొందని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తాను బిజీగా ఉన్నానని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని కోరారు. అలాగే, విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని, వీలైతే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే తనను విచారించాలని ఆయన ప్రతిపాదించారు.
సిట్ సానుకూల స్పందన:
కేసీఆర్ అభ్యర్థనపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా ఆయనకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, తదుపరి విచారణ తేదీ ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. దీనిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఎర్రవల్లిలో రాజకీయ సమీకరణాలు: మరోవైపు, సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా సిట్ నోటీసులపై అనుసరించాల్సిన న్యాయపరమైన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం వంటి అంశాలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు.