Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై వేగం పెంచిన బీజేపీ
Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో మెజారిటీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.
Telangana Municipal Elections 2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో మెజారిటీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ప్రచారంలో భాగంగా ప్రధానంగా రెండు విషయాలపై ఫోకస్ పెట్టింది. ఒక వైపు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు...తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల కరపత్రం తయారు చేసింది. మరోవైపు కాంగ్రెస్ హామీల వైఫల్యాలపై ఓ కరపత్రం తయారు చేసి...ఈ కరపత్రంతో డోర్ టూ డోర్ వెళ్లి ప్రచారం చేయనుంది బీజేపీ.
మరోవైపు జిల్లా ఇంచార్జీలు, మున్సిపాలిటీల ఇంచార్జిలతో బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు రేపు బ్రేక్‌ఫస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు దిశ నిర్దేశం చేయనున్నారు. మీటింగ్ అనంతరం ఇంచార్జీలకు పార్టీ చీఫ్ రాంచందర్‌రావు బి-ఫారాలు ఇవ్వనున్నారు.