ASHA Workers Protest: ఆశా వర్కర్ల గళం: కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష - ప్రభుత్వానికి సిపిఎం హెచ్చరిక
ASHA Workers Protest: ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట 48 గంటల నిరవధిక దీక్ష. రూ. 18,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సిపిఎం డిమాండ్. వంటా-వార్పుతో వినూత్న నిరసన.
ASHA Workers Protest: ఆశా వర్కర్ల గళం: కలెక్టరేట్ ఎదుట 48 గంటల దీక్ష - ప్రభుత్వానికి సిపిఎం హెచ్చరిక
ASHA Workers Protest: గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల 48 గంటల నిరవధిక దీక్ష శిబిరాన్ని సందర్శించి, వారికి మద్దతు ప్రకటించి మాట్లాడుతూ నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అమలు చేయలేదని, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన అనేక హామీలు నేటికీ అమలు కాలేదు అన్నారు. నేటికీ వేతనాలు పెంచలేదన్నారు. జిల్లాలో ఆశ వర్కర్లు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారన్నారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో నెలకు 18000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత, వేతన సవరణ చేయండి...
పెండింగ్ లో ఉన్న లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలన్నారు. గత హామీ మేరకు 50 లక్షల ఇన్సూరెన్స్, 50 వేల మట్టి ఖర్చులు ఇవ్వాలన్నారు.
పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇచ్చిన హామీలే నెరవేర్చండి గొంతెమ్మ కోరికలు లేవు..
ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. టార్గెట్లను రద్దుచేసి రిటైర్మెంట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు చెల్లించాలన్నారు. అర్హులైన వారిని ఏఎన్ఎంలుగా నియమించాలన్నారు. ప్రసూతి సెలవులు కల్పించి మహిళలకు అండగా నిలవాలన్నారు.
వినూతనంగా వంటావార్పుతో నిరసన..
రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల నిరసన కార్యకర్తలను తెలియజేస్తూ, నేడు వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కూడా కలెక్టరేట్ ముందు మహిళలు పడుకొని నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని గతంలో కూడా పలుమార్లు నిరసన కార్యక్రమాలు తెలియజేసినట్లు తెలిపారు.
ప్రభుత్వం స్పందించకుంటే దశలవారీగా పోరాటాలు చేస్తాం..
నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం వలె కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలను రోడ్డుమీదికి తెచ్చింది అన్నారు.
అక్రమ అరెస్టులతో ఉద్యమాలను పోరాటాలను ఆపలేరు అన్న విషయాన్ని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు.ఆశ వర్కర్లు చేస్తున్న న్యాయమైన డిమాండ్ల సాధనకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం అండగా ఉంటుందన్నారు. ప్రత్యక్ష పోరాటాల్లో సైతం పాల్గొంటామన్నారు.